• Thu. Jun 4th, 2026

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే తోట

Avatar photo

BySangayappa matapathi

Sep 17, 2025

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్ లోని మైథిలి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేది కేవలం జర్నలిస్టులేనని ఆయన కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పాటిల్, ఆలయ చైర్మన్ రామ్ పాటిల్, డోంగ్లి సహకార సంఘం చైర్మన్ రామ్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జు దేశాయి, చౌలవార్ హన్మండ్లు తదితరులు ఉన్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *