మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం
మరియు కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం
సోమవారం (19-01-2026) ఉదయం 11:00 గంటలకు
మద్నూర్‌లోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్‌వార్ సాయిలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి
జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు గారు
ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రజల విశ్వాసం పొందిన ప్రజాప్రతినిధులను గౌరవించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సాయిలు పేర్కొన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, పార్టీ అభిమానులు
పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్‌వార్ సాయిలు ప్రజలకు ఆహ్వానం పలికారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
