మద్నూర్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మండలాలైన డోంగ్లీ మరియు మద్నూర్ మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన మైనారిటీ ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు ముఖ్య అతిథి గా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వం మరియు సామరస్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్థానిక మైనారిటీ నాయకులు జవీద్ పాటిల్, మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, సంతోష్ మెస్త్రి తదితర నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలాగే మైనారిటీ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందును ఆనందంగా జరుపుకున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
