• Sun. Oct 25th, 2026

“మద్నూర్‌లో RDO తనిఖీలు.. భూ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన”

Avatar photo

BySangayappa matapathi

Oct 6, 2026

మద్నూర్: బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి మంగళవారం మద్నూర్ మండలంలో పర్యటించారు. మద్నూర్ మండల కేంద్రం, కొట్చిర గ్రామాల్లో దేవాదాయ–రెవెన్యూ శాఖలకు సంబంధించిన భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల రికార్డులు, హద్దులు, ఆక్రమణలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సోమూర్ గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించిన RDO.. గ్రామస్థులు, రైతులతో మాట్లాడి సర్వేలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి పట్టాదారు భూమికి ఖచ్చితమైన హద్దులు గుర్తిస్తూ పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ పర్యటనలో మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్, గిర్దావర్ మురళీధర్, సర్వేయర్ వెంకట్, ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *