మహారాష్ట్రలో కొనసాగుతున్న మన్మథస్వామి పాదయాత్రలో బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామీజీకి భక్తులు ఘనంగా హారతులు చేసి దర్శనం చేసి వారి పాదయాత్ర దిండి లో మద్నూర్ కాంగ్రెస్ నాయకులు భక్తి తో కొంచెం దూరం నడిచారు అనంతరం భక్తులతో కలిసి జెండా పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో దిండి లో రావడం అదృష్టం గా భావిస్తున్నామని మద్నూరు నాయకులు తెలియజేసారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్రలోని పరళి జ్యోతిర్లింగ శ్రీ వైద్యనాథ్ ఆలయం, అనంతరం కాపిల్ధార్ మన్మథస్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నారు.ఈ సేవ కార్యక్రమంలో రామ్ పటేల్, మద్నూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరస్ సాయిలు, మాజీ సొసైటీ ఛైర్మన్ కొండ గంగాధర్ , యువజన నాయకుడు హన్మంత్ యాదవ్ దేవిడాస్, హన్మాండ్లు సాయిలు, రాములు తదితరులు పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
