• Thu. Jun 4th, 2026

తడగూర్ పెద్ద గ్రామంలో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి కొండ గంగాధర్ రూ.1,11,111 విరాళం

Avatar photo

BySangayappa matapathi

Mar 20, 2026

మద్నూర్ మండలం పెద్ద తడ్డూర్ : గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న పురాతన శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మద్నూర్ సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండ గంగాధర్ గారు ఆలయ నిర్మాణ కోసం రూపాయలు 1,11,111/- (ఒక లక్ష పదకొండు వేల పదకొండు వందల పదకొండు రూపాయలు) విరాళంగా అందజేశారు.
గ్రామస్తులు ఆలయ పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించి దాత కొండ గంగాధర్ ముందుకు వచ్చి నగదు అందజేయడం జరిగింది. గతంలో కూడా పలు ఆలయాల నిర్మాణాలకు, అయోధ్యలోని శ్రీ రామాలయం నిర్మాణానికి కూడా కొండ గంగాధర్ నగదు అందజేసిన విషయం తెలిసిందే.
ధర్మకార్యాలకు ఎల్లప్పుడూ ముందుండే దాత కొండ గంగాధర్‌ను గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందించారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *