మద్నూర్ మండలంలోని శక్కరగా పెద్ద గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయల నిధులతో పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశాలక్ష్మి రామ్ పటేల్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు కృషి తో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయన్నారు. నియోజక వర్గం అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని దరాస్ సాయిలు అన్నారు
ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, కాంగ్రెస్ నాయకులు సంతోష్ పటేల్, దేవిదాస్ పటేల్ తో పాటు గ్రామ పెద్దలు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు రాకపోకలు సులభం అవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
