• Tue. Jun 2nd, 2026

మద్నూర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు –

BySangayyappa Matapathi

Apr 13, 2026

మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సౌజన్య రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజలు నిర్వహించి, టెంకాయ కొట్టి నివాళులు అర్పించారు. నాయకులు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు, కాంగ్రెస్ నాయకులు రామ్ పటేల్, ప్రజ్ఞకుమార్, విట్టల్ గురిజి, హన్మంత్ యాదవ్, కృష్ణ పటేల్, గోపి, అశోక్, సంతోష్ పటేల్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *