• Thu. Jun 4th, 2026

వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి – RWS అధికారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాలు

Avatar photo

BySangayappa matapathi

Mar 14, 2026

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు RWS అధికారులకు సూచించారు.
శనివారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పైప్‌లైన్‌ల మరమ్మతులు మరియు నిర్వహణ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.
మోటార్ల సమస్యలు వంటి చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *