మద్నూర్ మండలం సలబాత్‌పూర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం భక్తి వాతావరణం నెలకొంది.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఉదయం 3:30 గంటలకు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్‌లు సీనుపటేల్, గంగాధర్, మద్నూర్, కెలూర్, శక్కరగా గ్రామాల సర్పంచ్‌లు, మండల నాయకులు పాల్గొన్నారు.
పూజల అనంతరం ఆలయ కమిటీ తరఫున పలువురిని శాలువాలతో సన్మానించారు.
భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయగా, వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి దర్శనం పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
