మద్నూర్ మండలంలోని గ్రామాల్లో అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని మద్నూర్ ఎస్‌ఐ రాజు ప్రజలకు సూచించారు. గ్రామాల్లో భద్రత ప్రజల అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఒంటరిగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లకుండా ఉండాలని సూచించారు. అవసరమైతే కుటుంబ సభ్యులను లేదా నమ్మకమైన వ్యక్తులను వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్ మరియు వైర్ తీగల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఎప్పటికప్పుడు హుషారుగా, తెలివిగా వ్యవహరించాలని ఎస్‌ఐ రాజు సూచించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే దొంగలను త్వరగా పట్టుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు పోలీసులతో సహకరించి, భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే గ్రామాల్లో నేరాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
