• Tue. Jun 2nd, 2026

జుక్కల్‌ సెగ్మెంట్ లో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా…ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావును అభినందించిన మంత్రి సీతక్క

Avatar photo

BySangayappa matapathi

Jan 1, 2026

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 77 శాతం స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన నేపథ్యంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారిని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మంత్రి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అద్భుత విజయానికి కారణమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారి నాయకత్వాన్ని మంత్రి సీతక్క గారు ప్రశంసించారు.
జుక్కల్ నియోజకవర్గంలో 77 శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారి సేవలను కొనియాడుతూ, శాలువాతో సన్మానించారు.
ఈ విజయం జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఆయన తో పాటు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ఏలే మల్లికార్జున్ అలాగే సాయి పటేల్ పాల్గొన్నారు

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *