జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు మరోసారి రాష్ట్ర స్థాయిలో తన చొరవను చాటారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రజా భవన్‌లో కృష్ణా నదీ జలాలపై నిర్వహించిన నీటి పారుదల శాఖ కీలక సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా సరిహద్దు నియోజకవర్గాల సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
అలాగే పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ బలోపేతం, ప్రజల సంక్షేమ కార్యక్రమాల అమలు అంశాలపై సానుకూలంగా చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ,
ప్రజా సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నాయకుడిగా
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు గారి చొరవ ప్రశంసనీయం అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
