డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,
డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామారావు పటేల్ గారి ఆకస్మిక మృతి
తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
ఈరోజు డోంగ్లీ గ్రామానికి చేరుకుని
శివాజీ రామారావు పటేల్ గారి భౌతికకాయానికి పూలమాల వేసి
శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం అంత్యక్రియలలో పాల్గొని
పాడె మోసి అశ్రునయనాలతో వేలాది మంది తో వీడ్కోలు పలికారు.
శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను
ఎమ్మెల్యే గారు ఓదార్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన
నిబద్ధత, నిజాయితీ గల నాయకుడిని
కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శివాజీ రామారావు పటేల్ గారి మరణం
వారి కుటుంబానికి మాత్రమే కాకుండా
పార్టీకి కూడా తీరని లోటని తెలిపారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
