చరిత్రలో తొలిసారి మున్సిపాలిటీ ఎన్నికలు – రాజకీయ ఉత్కంఠ**
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణానికి కీలక గుర్తింపు లభించింది.
మొట్టమొదటిసారిగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో
రాబోయే ఎన్నికలకు బీసీ జనరల్ కేటగిరీగా స్థానం కేటాయించబడింది.
ఇది బిచ్కుంద చరిత్రలోనే కాకుండా,
జుక్కల్ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఒక విశేష ఘట్టంగా నిలిచింది.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు ప్రత్యేక చొరవతో
బిచ్కుందకు నూతన మున్సిపాలిటీ హోదా సాధ్యమైంది.
జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏకైక మున్సిపాలిటీగా బిచ్కుంద ఉండడం గమనార్హం.
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే
ఇంతకాలం మున్సిపాలిటీ లేని జుక్కల్ నియోజకవర్గానికి
మొదటిసారిగా మున్సిపాలిటీ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బీసీ జనరల్‌కు స్థానం కేటాయించడంతో
స్థానిక బీసీ నాయకులు, ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
అటు రాజకీయ పార్టీల్లోనూ
అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
మొట్టమొదటిసారి జరగనున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో
ప్రజల తీర్పు ఎవరిని వరించనుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
బిచ్కుంద రాజకీయ భవితవ్యం ఎవరి చేతుల్లోకి వెళ్లనుందో
అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
