మద్నూర్ మండలంలోని మోఘ గ్రామంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ టీవీ కెమెరాలను కొత్తగా అమర్చారు.
ఈ సీసీ టీవీ కెమెరాల ప్రారంభ కార్యక్రమాన్ని మద్నూర్ ఎస్.ఐ. మోహన్ రెడ్డి గారు స్వయంగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ,
గ్రామాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు, చట్టసువ్యవస్థ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
గ్రామస్థులు పోలీసు శాఖకు సహకరిస్తూ, శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
మోఘ గ్రామ సర్పంచ్ బస్వంత్ హాళ్ళే,
ఉప సర్పంచ్ బాబు పటేల్,
ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,
సంగ్రామ్ పటేల్, సురేష్, బస్వంత్, దావల్
తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కావడంతో ప్రజల్లో భద్రతాపరమైన నమ్మకం మరింత పెరిగిందని,
గ్రామాభివృద్ధికి ఇది మరో కీలక ముందడుగని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
