• Thu. Jun 4th, 2026

జుక్కల్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీజేపీ జిల్లా నాయకుడు కృష్ణ పటేల్

Avatar photo

BySangayappa matapathi

Jan 19, 2026

మద్నూర్ మద్నూర్ మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
బీజేపీ జిల్లా నాయకుడిగా ఉన్న కృష్ణ పటేల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని అధికారికంగా పార్టీలో చేరారు.ఆయనతో పాటు వారి అనుచరులు కూడా చేరారు
మద్నూర్ ప్రాంత అభివృద్ధి కోసం, అలాగే జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కృష్ణ పటేల్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ విధానాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఈ చేరిక కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు పాల్గొని, కృష్ణ పటేల్‌కు కాంగ్రెస్ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ, పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
“మద్నూర్ అభివృద్ధి కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. మీ వెనుక నేను ఉన్నాను” అంటూ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు కృష్ణ పటేల్‌కు భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న ఈ చేరికలు మద్నూర్ ప్రాంత రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *