• Thu. Jun 4th, 2026

గాంధీభవన్ నుంచే మునిసిపాలిటీ ఎన్నికల శంఖారావం…పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు,డిసిసి మల్లికార్జున్

Avatar photo

BySangayappa matapathi

Jan 31, 2026

హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మునిసిపాలిటీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కీలక సమన్వయ సమావేశం నిర్వహించింది. రానున్న మునిసిపాలిటీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించింది.
ఈ సమావేశానికి TPCC అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, AICC సెక్రటరీ శ్రీ సచిన్ సావంత్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అజారుద్దీన్,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు హాజరై, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మునిసిపాలిటీలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, బూత్ స్థాయి కార్యాచరణపై లోతైన చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో నమ్మకం ఉన్న నాయకులకే అవకాశాలు ఇవ్వాలని నేతలు సూచించారు.
మునిసిపాలిటీ ఎన్నికల మొత్తం కార్యాచరణను జిల్లా గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే నిర్వహించాలన్న నిర్ణయాన్ని తీసుకోగా, ఈ ప్రక్రియను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల బీ–ఫారమ్‌లు కూడా జిల్లా గాంధీభవన్ నుంచే అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సమావేశంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసిందని, మునిసిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *