• Thu. Jun 4th, 2026

మద్నూర్‌లో పానాది మూళ్ళ పొదలుతో నిండి ఉండడం తో హద్దులు వేయాలని… మద్నూర్ ఎమ్మర్వో కు రైతుల వినతిపత్రం

Avatar photo

BySangayappa matapathi

Feb 2, 2026

మద్నూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గల్లీ నుంచి అవల్గాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పానది పూర్తిగా మూళ్ల పొదలతో నిండి కబ్జాకు గురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఈ రహదారి గుండా అవల్గాం–తడగూర్ గ్రామాలకు రైతులు, స్థానిక ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేవారని, అయితే ప్రస్తుతం రహదారి పూర్తిగా మూసుకుపోయి నడవడానికి కూడా వీలుకాని పరిస్థితి నెలకొందని తెలిపారు.
1954–55 నక్ష ప్రకారం ఈ రహదారిని సర్వే నిర్వహిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే అవల్గాం, తడగూర్ గ్రామాలకు వెళ్లే మార్గం మరింత సుగమంగా మారుతుందని రైతులు పేర్కొన్నారు.
ఈ సమస్యపై స్పందించిన రైతులు మద్నూర్ స్థానిక ఎమ్మార్వో ముజీబ్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ రహదారి ఎంత ఉందో హద్దులు వేసి ఇవ్వాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో ముజీబ్ మాట్లాడుతూ, సంబంధిత రహదారిపై సర్వే నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అలాగే ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు, స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.రైతు ఉత్పత్తు దారుల సంగం అధ్యక్షుడు చాట్ల గోపాల్, మాజీ ఎంపీటీసీ లక్ష్మన్ ,గడ్డం రమేష్, సంజీవ్,కిషన్,బాలాజీ,గిరీష్ దేశాయ్, దత్తు తో పాటు రైతులు ప్రజలు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *