బిచ్కుంద మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో కైవసం సాధించింది. మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, 2 వార్డులు బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి.
కాంగ్రెస్ తరఫున 1, 2, 3, 6, 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో అభ్యర్థులు విజయం సాధించారు. 4వ మరియు 5వ వార్డుల్లో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించడంతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
బిచ్కుంద ప్రజల తీర్పుతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలమైన స్థానం సంపాదించుకుంది.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
