• Thu. Jun 4th, 2026

మద్నూర్ ఎమ్మర్వో కార్యాలయంలో మహిళా ఉద్యోగులను సన్మానించిన తహసీల్దార్ ఎం.డి. ముజీబ్

Avatar photo

BySangayappa matapathi

Mar 7, 2026

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవం మరియు చట్టపరమైన హక్కుల గురించి వివరించారు. సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం ద్వారా దేశానికి మంచి గుర్తింపు వస్తుందని ఆయన తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిదవర్ శంకర్, సిబ్బంది రవి, సతీష్ మరియు ఇతర జీపీవోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *